
వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి
మోపాల్: గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ అధికారులు, వైద్యసిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ తగిన చర్యలు చేపట్టాలని నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కాల్పోల్‌లో స్థానిక పాఠశాలలో కొనసాగుతున్న వైద్యశిబిరాన్ని కాంగ్రెస్ ఆదివాసీ, గిరిజన జిల్లా చైర్మన్ కెతావత్ యాదగిరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డెంగీ, ఇతర వ్యాధులు ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీశారు. జ్వర పీడితులను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. జ్వరాలతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రత్యూషను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఎంపీడీవో రాములు నాయక్, మెడికల్ ఆఫీసర్ ప్రత్యూషను ఆదేశించారు. వారి వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మోహన్ నాయక్, మోపాల్ మండల అధ్యక్షుడు ఎల్లోల్ల సాయిరెడ్డి, గ్రామ అధ్యక్షుడు సురేశ్, గ్రామస్తులు ఉన్నారు.