
సిద్దిపేట మహాసభకు కార్మికులు తరలిరావాలి
నిజామాబాద్ నాగారం: సిద్దిపేటలో ఈ నెల 28న నిర్వహించే మహాసభకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లెడి గంగాధర్ కోరారు. శుక్రవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రమాద బీమా రూ. పది లక్షల సౌకర్యం కల్పించాలని, 55 ఏళ్లు నిండి కార్మికుడికి రూ. ఐదు వేల పింఛన్‌ను కార్మిక వెల్ఫేర్ బోర్డు నుంచి అందించాలని కోరారు. సభను కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెంచాల వేణు, కార్యదర్శి శాంతయ్య, సహాయ కార్యదర్శి ఎస్‌కే హనీఫ్, పట్టణ అధ్యక్షుడు పిండే బాబురావు, ఉపాధ్యక్షులు ముదారపు రాములు, కూనగంగాధర్, రమేశ్, రాజు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.