
ఓబీసీ సెమినార్‌లో పాల్గొన్న విపుల్ గౌడ్
నిజామాబాద్ సిటీ: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిర్వహించిన ఓబీసీ సమావేశంలో జిల్లా యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ పాల్గొన్నారు. సమావేశంలో ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. అణగారినవర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక అభ్యున్నతి అవశ్యకతపై చర్చించారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, మైన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, పలువురు నాయకులను విపుల్‌గౌడ్ కలిశారు.
ఉప తహసీల్దార్ బదిలీ
సిరికొండ: మండల ఉప తహసీల్దార్ ప్రవీణ్, కంప్యూటర్ ఆపరేటర్ అజ్మత్ బదిలీ అయ్యా రు. ఉప తహసీల్దార్ పౌరసరఫరాల శాఖ కా ర్యాలయానికి, కంప్యూటర్ ఆపరేటర్ మెండో రా మండలానికి బదిలీ అయ్యారు. వారి స్థానా ల్లో మండలానికి ఎవరినీ కేటాయించలేదు.