
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం వారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇల్లు ముట్టడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈక్రమంలో పోలీసులకు విద్యార్థి సంఘం నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి నాలుగో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందన్నారు. ఇప్పటికై నా స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. నాయకులు కార్తీక్, గౌతంకుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.