
శ్రావణ మాసం ఎంతో విశిష్టమైంది
నిజామాబాద్ రూరల్: శ్రావణ మాసం ఎంతో విశిష్టమైందని దేవాదాయ–ధర్మాదాయ శాఖ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహాయ కమిషనర్ విజయరామారావు అన్నారు. శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని నగరంలోని జెండాబాలాజీ, గోల్‌హనుమాన్ ఆలయాలను పరిశీలించారు. అనతరం ఆలయాల్లో పూజలు చేశారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని జెండా బాలాజీ, గోల్‌హనుమాన్, సారంగపూర్ హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టున్నట్లు పేర్కొన్నారు.
వారాహి దేవాలయంలో..
నగర శివారులో ఉన్న శ్రీ వారాహి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి రోజు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పేర్కొన్నారు.

శ్రావణ మాసం ఎంతో విశిష్టమైంది