నూతన గేట్‌ వాల్వ్‌ బిగింపు | - | Sakshi
Sakshi News home page

నూతన గేట్‌ వాల్వ్‌ బిగింపు

Jul 26 2025 9:00 AM | Updated on Jul 26 2025 10:18 AM

నూతన

నూతన గేట్‌ వాల్వ్‌ బిగింపు

సిరికొండ: మండలంలోని గడ్కోల్‌ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నెలకొన్న నీటి కష్టాలను అధికారులు తొలగించారు. నీటి కష్టాలపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 24న ‘గడ్కోల్‌లో నీటి తిప్పలు’ అనే కథనం ప్రచురితమైంది. కథనానికి స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి మఖ్దుం చెడిపోయిన గేట్‌ వాల్వ్‌ స్థానంలో నూతన గేట్‌ వాల్వ్‌ను ఏర్పాటు చేయించారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

మోపాల్‌: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని సవిత్ర చిట్‌ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌ అన్నారు. మోపాల్‌ మండలంలోని సిర్‌పూర్‌ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు సుదర్శన్‌ రూ.15వేల విలువైన గుర్తింపుకార్డులు, వాటర్‌ బాటిళ్లు, పరీక్ష ప్యాడ్లను శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేశ్‌రావు, వసంత, అనురాధ, గంగాప్రసాద్‌, సుకన్య, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆర్టికల్‌ 19ని ఎత్తివేయాలి

నిజామాబాద్‌ నాగారం: కులవృత్తే జీవనాధారంగా జీవిస్తున్న నాయీబ్రాహ్మణులకు ఆర్టికల్‌ 19తో అన్యాయం జరుగుతోందని దానిని వెంటనే ఎత్తివేయాలని నగర నాయీబ్రాహ్మణ దుకాణదారుల యూనియన్‌ అధ్యక్షులు దేశాయి గంగాధర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం గాజులపేటలోని కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆర్టికల్‌ 19లో ఉన్న 18వ సవరణను సవరించి కులవృత్తులను ఆదుకోవాలన్నారు. నాయీబ్రాహ్మనేతరులు సెలూన్‌ షాపు పెట్టుకోవచ్చన్న నిబంధన ఉన్న ఆర్టికల్‌ 19ని రద్దు చేయాలన్నారు. హైకోర్టు తీర్పు ఇవ్వడం విచారకరమన్నారు. సమావేశంలో నాయకులు అంజయ్య, రామకృష్ణ, బాలస్వామి, సురేందర్‌, హన్మాండ్లు, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులో యూరియా

సిరికొండ: రైతులకు యూరియాను అందుబాటులో ఉంచుతున్నామని మండల వ్యవసాయశాఖ అధికారి నర్సయ్య తెలిపారు. మండల కేంద్రంలోని సొసైటీలో యూరియాను రై తులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సీజన్‌ లో ఇప్పటి వరకు 2277 మెట్రిక్‌ టన్నుల యూ రియాను మండలంలో పంపిణీ చేసినట్లు తెలి పారు. మండలానికి ప్రతి రోజు 60 నుంచి 80 టన్నుల వరకు యూరియాను సరఫరా చేస్తున్నామని అన్నారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

సుభాష్‌నగర్‌: నగరంలోని వినాయక్‌నగర్‌ సబ్‌స్టేషన్‌లో నాల్గో శనివారం నిర్వహణలో భాగంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని టౌన్‌–1 ఏడీఈ ఆర్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోటగల్లి, గాయత్రినగర్‌, ఫులాంగ్‌, నిఖిల్‌సాయి హోటల్‌, యెండల టవర్స్‌, తుల్జాభవానీ ఆలయం తదితర ఏరియాల్లో విద్యుత్‌ ఉండదని పేర్కొన్నారు.

మొరం టిప్పర్‌ పట్టివేత

మోపాల్‌: మండలకేంద్రంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న మొరం టిప్పర్‌ను పట్టు కున్నట్లు ఎస్సై జాడే సుస్మిత శుక్రవారం తెలిపారు. అక్రమంగా మొరం తరలిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

చోరీ కేసులో నిందితుడి పట్టివేత

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కేశ్‌పూర్‌గ్రామంలో ఈనెల 23న రా త్రి జరిగిన చోరీ కేసులో నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో మహ్మద్‌ ఆరీఫ్‌ శుక్రవారం తెలిపారు. కేశాపూర్‌ గ్రామశివారులో ఉన్న మహాలక్ష్మీ ఆలయంలో అమ్మవారి పుస్తెలతాడు, వినాయకుని పంచలో హ విగ్రహం, హుండీ డబ్బులు అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచార ణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకొని, చోరీకి గురైన వస్తువులను రికవరీ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వివరించారు.

నూతన గేట్‌ వాల్వ్‌ బిగింపు 1
1/3

నూతన గేట్‌ వాల్వ్‌ బిగింపు

నూతన గేట్‌ వాల్వ్‌ బిగింపు 2
2/3

నూతన గేట్‌ వాల్వ్‌ బిగింపు

నూతన గేట్‌ వాల్వ్‌ బిగింపు 3
3/3

నూతన గేట్‌ వాల్వ్‌ బిగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement