
ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్
నిజామాబాద్ నాగారం: నగరంలోని మారుతినగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్ ప్రమా దకరంగా ఉన్నాయి. రోడ్డు కంటే ఎత్తులో ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాహనదారులు ఆదమరిస్తే అంతే సంగతులు. పలువురు వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలైన ఘటనలు ఉన్నాయి. నెల రోజుల క్రితం ఈ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్ మరమ్మ తుల కోసం తవ్వారు. మరమ్మతులను తూతూ మంత్రంగా చేపట్టి అలాగే వదిలేశారు. మారుతినగర్‌లో స్కూల్ బస్సులు, పలు వాహనాలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుంది. రాత్రిళ్లు ఈ ప్రాంతం గుండా కొత్త వారు వస్తే మ్యాన్‌హోల్స్ గమనించక వాటి గుండా ప్రయాణిస్తుండడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. వీటి చుట్టూ రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మారుతినగర్‌లో రోడ్డు కంటే ఎత్తులో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్
ఆదమరిస్తే అంతే సంగతులు
ఇబ్బందిపడుతున్న కాలనీవాసులు, వాహనదారులు
పట్టించుకోని అధికారులు

ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్

ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్