
ప్రభుత్వ విద్య.. వైద్యం అంతా మిథ్యేనా..?
ఇందల్వాయి: ప్రజలకు అందించే వైద్యం, విద్యపై ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో పై ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయి, విష పు రుగులు, దోమలకు ఆవాసంగా మారే అవకాశం ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గత కొన్నేళ్లుగా వర్షాకాలంలో ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంటోంది.
తిర్మన్‌పల్లి గ్రామంలో రోడ్డు పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదుల్లో నీరు చేరుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఏళ్ల తరబడి నీళ్లు చేరుతున్న ప్రతీసారి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటితో పాటు పాఠశాలలోకి దుర్గందం చేరి విద్యార్థుల ఆరోగ్యం, మధ్యాహ్న భోజనం కలుషితమయ్యే అవకాశం ఉన్నా సమస్యను ఎవరూ పరిష్కరించడంలేదు. సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు స్థానిక ప్రజలు పలుమార్లు వినతిప్రతాలు అందించినా పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ప్రభుత్వ విద్య.. వైద్యం అంతా మిథ్యేనా..?