
పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు
ధర్పల్లి: వర్షాకాలంలో వచ్చే జలుబు, సాధారణ జ్వరాలు, మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రోజువారి దినచర్యల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాల, వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే కాలానుగుణ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
దోమల వ్యాప్తితో..
గ్రామాల్లో డ్రెయినేజీ సౌకర్యాలు లేకపోవడంతో రోడ్లపైనే మురికినీరు నిలుస్తుంది. దీని వల్ల దోమలు వ్యాప్తి చెంది ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. తలనొప్పి, గొంతునొప్పి, మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా, విషజ్వరాలు, డెంగీ, పైలేరియా వంటివి ప్రబలే అవకాశాలున్నాయి.
● విష జ్వరాలు..
ఒళ్లు నొప్పులు, జలుబు, తుమ్ములతో జ్వరం వస్తుంది. వారం రోజుల పాటు జ్వరం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి, చలి, నీరసం విష జ్వరాల ప్రధాన లక్షణం.
● దోమలను అరికట్టే విధానం..
ఇళ్లలోని మంచినీటి తొట్లలో నీరు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈగలు, దోమలు ముసరకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో వేస్ట్ ఆయిల్ స్ప్రే చేయాలి. దోమ తెరలను తప్పని సరిగా ఉపయోగించాలి. గ్రామాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా, లార్వా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తాగేనీటిని కాచి చల్లార్చిన తర్వాతే తాగాలి.
అప్రమత్తతే నివారణ మార్గం
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న
అధికారులు
చెత్త తొలగిస్తున్నాం
జీపీల్లో ప్రతిరో జు శానిటేషన్ పనులు చేస్తున్నాం. పంచాయ తీ ట్రాక్టర్ ద్వారా గ్రామాల్లో ఉన్న చెత్తను ప్రతిరోజు డంపింగ్ యార్డ్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– లక్ష్మారెడ్డి, ఎంపీడీవో, ధర్పల్లి

పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు