
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి
● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
డిచ్‌పల్లి: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం డిచ్‌పల్లి మండలం రాంపూర్ సొసైటీ ఆధ్వర్యంలో మిట్టాపల్లిలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన 250 మెట్రిక్ టన్నుల గోదాంను డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిందన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్, సాగుకు ఉచిత కరెంట్ అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే సొసైటీల ద్వారా రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, నవీన్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు కంచెటి గంగాధర్, నర్స య్య, డిచ్‌పల్లి సొసైటీ చైర్మన్ రాంచందర్ గౌడ్, నా యకులు గణేశ్, బాల గంగాధర్, సొసైటీ సీఈవో నాగరాజు, సిబ్బంది నాగేశ్వరరావు, డైరెక్టర్లు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.