
ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి
నిజామాబాద్ నాగారం: జిల్లా కేంద్రంలోని బృందావనం గార్డెన్‌లో ఈ నెల 27న నిర్వహించే బంజారా సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీహరినాయక్, జిల్లా అధ్యక్షుడు మోహన్‌నాయక్ కోరారు. శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బంజారాల ఐక్యత చాటడానికి ఈ ఆత్మీయ సమ్మేళ నాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఆలిండియా బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు ఉమేశ్, రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ హాజరవుతారని అన్నారు. అనంతరం ఆత్మీయ సమ్మేళన పోస్టర్లను ఆవిష్కరించారు. సమ్మేళనాన్ని సంఘ సభ్యులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రవి నాయక్, ఉపాధ్యక్షులు రామారావు, చిన్న నాయక్, నాయకులు పాల్గొన్నారు.