
ఫంక్షన్‌హాల్ గేటు కూల్చివేత
డిచ్‌పల్లి: మండల కేంద్రం శివారులోని జీ కన్వెన్షన్ ఫంక్షన్‌హాల్ మెయిన్ గేటును గురువారం మధ్యాహ్నం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. సమచారం అందుకున్న డిచ్‌పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జీ కన్వెన్షన్ యజమానులు కొందరి వద్ద అప్పులు చేసి నష్టాలపాలు కావడంతో ఐపీ పెట్టారు. ఏడాదిన్నర కాలం గడిచినా బాధితులకు డబ్బులు ముట్టకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీ తీసుకెళ్లి కన్వెన్షన్ గేటును కూల్చివేయడంతోపాటు లోనికి వెళ్లకుండా గేటు ముందు గుంత తవ్వి వెళ్లిపోయారు. ఈఘటనపై కన్వెన్షన్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.