
అరుదైన జానపద నృత్య రూపకం ‘చిందు’
మీకు తెలుసా?
ఆర్మూర్: అరుదైన జానపద నృత్యరీతిగా గుర్తింపు తెచ్చుకున్న చిందులు మన తెలంగాణలోనే కనబడతారు. కొన్నేళ్ల కిందట ఈ కళను నమ్ముకొని నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో సుమారు ఐదువేల కుటుంబాలు జీవనం సాగించేవి. ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఆర్మూర్, భీమ్‌గల్, బాల్కొండ, బోధన్, బాన్స్‌వాడ ప్రాంతాలలో రెండు వేల మంది కళాకారులు ఉండేవారని అంచనా.
● హరిజనులలో ఒక తెగ అయిన మాదిగ వారిని అడుక్కోవడానికి చిందులు వేసేవారే ఈ చిందు కళాకారులు లేదా చిందు మాదిగలు.
● వీరు ప్రదర్శించే యక్షగానం పేరే చిందు భాగోతం లేదా చిందు భాగవతం.
● చిందు కళాకారుల రామాయణ, మహాభారత, భాగవతాలలో ప్రధాన ఘట్టాలను రంగస్థలంపై ప్రదర్శించేవారు.
● ప్రస్తుతం రంగస్థల ప్రదర్శనలు కనుమరుగుకావడంతో, వారు చిందు ప్రదర్శనలను తగ్గించారు.
పాత ఫోన్లు కొనేటప్పుడు జాగ్రత్త..
ఖలీల్‌వాడి: తక్కువ ఽరేటుకు మంచి సెల్‌ఫోన్లు వస్తున్నాయని చాలా మంది పాతవి కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ ఫోన్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందుల్లో పడక తప్పదు. ప్రతి సెల్‌ఫోన్‌కు ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. గతంలో ఏదైనా నేరాలకు పాల్పడిన వారు ఫోన్‌ను విక్రయిస్తే, కొనుగోలు చేసినవారు ఇబ్బందులు పడతారు. అలాగే కొందరు సెల్‌ఫోన్లను చోరీ చేసి తక్కువ ధరకు అమ్ముతుంటారు. వీటిని కొన్న తర్వాత పోలీసు సమస్యలు రావచ్చు. ఎప్పుడైనా పాత ఫోన్ కొనేటప్పుడు వారి పూర్తి వివరాలు, చిరునామా తీసుకోవాలి. అలాగే లిఖిత పూర్వకంగా పత్రం రాసుకొని తీసుకుంటే కొంత మేర ఇబ్బందులు తప్పే అవకాశాలు ఉంటాయి.
సమాచారం..