
పేదలకు ఇళ్లు ఇవ్వకుంటే నిరాహార దీక్ష చేస్తా
సుభాష్‌నగర్: నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతోపాటు డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మరమ్మతులు చేసి దీపావళి నాటికి పంపిణీ చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ డెడ్‌లైన్ ప్రకటించారు. లేకుంటే పేదలతో కలిసి ధర్నా, నిరాహార దీక్షకు సిద్ధమన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది దసరా నాటికే ఇళ్లను ఇస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారని, కానీ ఏడాది కావస్తున్నా ఇళ్లకు మోక్షం లభించలేదన్నారు. జాగా ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు అని ప్రభుత్వం ప్రకటించిందని, అర్బన్ ఏరియాలో కార్మికులు, ఆటోడ్రైవర్లకు గజం జాగా కొనే స్థోమత ఉందా అని ప్రశ్నించారు. రెండో విడతలో జాగా లేని అర్హులకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్‌చేశారు. 80శాతం పూర్తయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం వాటా ఇస్తోందని, ఇళ్లపై ప్రధానమంత్రి పేరు, ఫొటో పెట్టాలని డిమాండ్‌చేశారు. నాయకులు, మాజీ కార్పొరేటర్లు గోపిడి స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్, మాస్టర్ శంకర్, నాగరాజు, తారక్ వేణు, పల్నాటి కార్తీక్, పంచరెడ్డి శ్రీధర్, కిషోర్, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌బెడ్ రూం ఇళ్లు
దీపావళి నాటికి అందించాలి
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ