
డివిజన్‌లోనే మొదటి ప్రభుత్వ కాలేజీ
మీకు తెలుసా?
ఆర్మూర్ డివిజన్‌లో మొట్టమొదటి ప్రభుత్వ జూనియర్ కళాశాల పిప్రి రోడ్‌లో ఏర్పాటు చేశారన్న విషయం ఎంతమందికి తెలుసు?
● 1969లో పిప్రి రోడ్డులో నెలకొల్పిన ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే జూనియర్ కళాశాలను సైతం నిర్వహించే వారు.
● 1996లో డిగ్రీ కళాశాల నుంచి వేరు చేస్తూ బాలుర జూనియర్ కళాశాలను పిప్రి రోడ్‌లో, బాలికల జూనియర్ కళాశాలను ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.
● 2016 విద్యా సంవత్సరంలో పిప్రి రోడ్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను కో ఎడ్యుకేషన్ కళాశాలగా ప్రభుత్వం మార్చింది.
● ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను మాత్రం బాలికల కళాశాలగానే నిర్వహిస్తున్నారు.
● అదే సమయంలో ఆర్మూర్ పట్టణంలో ప్రైవేటు జూనియర్ కళాశాలలను పెద్ద ఎత్తున స్థాపించడంతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో క్రమంగా బాలుర జూనియర్ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం మానేశారు.
● ప్రస్తుతం ఈ కళాశాలలో తెలుగు మీడియంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఇంగ్లిష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులతోపాటు కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఒకేషనల్ కోర్సును నిర్వహిస్తున్నారు.
● అడ్మిషన్ల కోసం కళాశాల ప్రిన్సిపల్
విజయానంద్ రెడ్డిని 94408 27986
నంబర్‌లో సంప్రదించవచ్చు. – ఆర్మూర్