
రైతన్న.. జర భద్రం
● ప్రకృతి వైపరీత్యాలు, విష కీటకాలతో పొంచి ఉన్న ప్రమాదాలు
● ఆదమరువొద్దు.. అప్రమత్తతే శ్రీరామరక్ష
బోధన్‌రూరల్/ఆర్మూర్: ఖరీఫ్ సీజన్ పంటల సాగు ఊపందుకుంది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. నిత్యం వ్యవసాయ క్షేత్రాల్లో ఉండే రైతులకు పొంచి ఉన్న ప్రమాదాలను అఽధిగమించడం కత్తి మీద సాము లాంటింది. ప్రకృతి వైపరీత్యాలు, పాములు, క్రిమికీటకాలు, విద్యుత్ మరమ్మతు పనులు, మందుల పిచికారీ సమయాల్లో ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతుంటారు. కొన్నిసార్లు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. అలాంటి ప్రమాదాల బారిన పడకుండా వ్యవసాయ క్షేత్రాల్లో అన్నదాతలు, వ్యవసాయ కూలీలు పాటించాల్సిన పలు జాగ్రత్తలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
పిడుగుపాటు
● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కిందకు వెళ్లొద్దు.
● విద్యుత్ ప్రసరించే వస్తువులు, కరెంట్ తీగలకు దూరంగా ఉండాలి.
పాములు, విషపురుగులు..
● పొలాల గట్లపై గడ్డి పెరగకుండా చూసుకోవాలి.
● కలుపు మొక్కలను తొలగించే, గట్లపై నడిచే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
● బోర్లు, మోటారు స్టాటర్ల వద్ద గడ్డి, పిచ్చి మొక్కలు పెరగకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
● ఏదైనా కీటకం కాటు వేసినట్లు అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించి సరైన వైద్యం చేయించుకోవాలి
● పాము, విష పురుగులు, కీటకాలు కరిచినప్పుడు నాటువైద్యం చేయించుకోకూడదు.
మందుల పిచికారీ సమయాల్లో..
● పురుగుల మందులను పిచికారీ చేసే సమయంలో రైతులు, కూలీలు చేతులకు గ్లౌజులు, కాళ్లకు రబ్బరు బూట్లు, ముక్కుకు గుడ్డలను ధరించాలి.
● పిచికారీ మందులను కర్ర సహాయంతో కలుపుకోవాలి.
● మందుల పిచికారీ, ఎరువులు చల్లడం వంటి పనులు పూర్తయిన వెంటనే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
● ఇంటికి వెళ్లగానే స్నానం చేసి తర్వాతే భోజనం చేయాలి.
● పురుగు మందుల డబ్బాలు, ఎరువుల బస్తాలను వాడిన వెంటనే సర్ఫ్ నీటితో శుభ్రం చేసుకోవాలి.
మూఢనమ్మకాలను వీడాలి..
పాముకాటుకు గురైనపుడు మూఢనమ్మకాలపై ఆధారపడి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటుకు గురైనవారు పీహెచ్‌సీలో చికిత్స చేయించుకోవడానికి రావాలి. ప్రథమ చికిత్సపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
– రమేశ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఆర్మూర్
పొలాల్లో ఉండే మోటారు స్టాటర్లలో వర్షపు నీరు చేరి సమస్యలు వస్తుంటాయి. వాటిని సరిచేసేందుకు రైతులు అజాగ్రత్తగా మోటార్లు, స్టాటర్లను తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
● మోటార్ బోర్డులు, స్టార్టర్లు వర్షానికి తడవకుండా ప్లాస్టిక్ డబ్బాలను అమర్చుకోవాలి.
● మోటార్లను ఆన్, ఆఫ్ చేసే సమయాల్లో చేతులు తడిగా లేకుండా చూసుకోవాలి.
● చేతులకు గ్లౌజులు వాడటంతో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ఉండొచ్చు.
● నాణ్యమైన పరికరాలు, కాళ్లకు పాదరక్షలు ఉంచుకుంటే మంచిది.
పాము కాటు నివారణ..
పాము కాటు వేయగానే అది విషపూరితమైన పామా లేక, మామూలు పామా అన్నది ముందుగా గుర్తించాలి. ఒకటి, రెండు కోరలతో కాటు వేసిన గాయం ఉంటే అది విషపూరితమైన పాముగా నిర్ధారించుకోవాలి. మూడు లేదా అంతకంటే ఎక్కువ కోరలతో గాయం ఉంటే అది విష రక్త పాముగా గుర్తించాలి. విషపూరితమైన పాము కాటు వేసినపుడు ప్రథమ చికిత్సలో భాగంగా కాటు వేసిన శరీర భాగం నుంచి గుండెకు రక్తం వెళ్లే వైపు తాడుతో గట్టిగా కట్టివేయాలి. కాటు వేసిన భాగంలో బ్లేడు లేదా సిరంజిలాంటి పదునైన ఆయుధంతో గాటు పెట్టి రక్తాన్ని పిండివేయాలి. నల్లని రక్తం వస్తుంది. అంటే విషపూరితమైన రక్తం అన్నమాట. ఇలా చేసిన తరువాత మనిషి స్పృహలోకి వస్తాడు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాలి.
విద్యుత్ విపత్తులు

రైతన్న.. జర భద్రం

రైతన్న.. జర భద్రం

రైతన్న.. జర భద్రం