కష్టార్జితమంతా కూతుళ్ల చదువుకే.. | - | Sakshi
Sakshi News home page

కష్టార్జితమంతా కూతుళ్ల చదువుకే..

Jun 15 2025 7:18 AM | Updated on Jun 15 2025 7:18 AM

కష్టార్జితమంతా కూతుళ్ల చదువుకే..

కష్టార్జితమంతా కూతుళ్ల చదువుకే..

బోధన్‌: మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఖండ్‌గాం గ్రామానికి చెందిన కాంబ్లే జనార్దన్‌ తన కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలనే కలతో బోధన్‌కు వచ్చి స్థిరపడ్డాడు. పెయింటింగ్‌ పని చేస్తూ కష్టాలకు ఎదురీదుతూ తాను అనుకున్నట్లుగానే కూతుళ్లు చందన, స్పందనను ఉన్నత చదువులు చదివించాడు. పెద్ద కూతురు చందన బోధన్‌లోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ (జువాలజీ) పూర్తి చేసింది. బ్యాక్‌లాగ్‌ గ్రూప్‌–4 ఉద్యోగ అర్హత పరీక్షలో ప్రతిభ చాటి వైద్యారోగ్యశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించింది. 2020లో కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖలో చేరగా, రెండేళ్ల తరువాత పదోన్నతి లభించింది. చందన ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తోంది. తన చెల్లి స్పందన బీటెక్‌ పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రముఖ కంపెనీలో మైసూర్‌లో ఉద్యోగం చేస్తోందని, మా నాన్న కష్టార్జితమే తమ చదువు, ఉద్యోగాలని స్పందన తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement