రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Published Tue, May 21 2024 5:45 AM

రోడ్డ

క్రైం కార్నర్‌

మరొకరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

బాల్కొండ: ముప్కాల్‌ మండలం రెంజర్లలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మెంచు లక్ష్మణ్‌(31) మృతి చెందాడు. ముప్కాల్‌ ఎస్సై భాస్కరాచారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ తన స్నేహితుడు సునీల్‌తో కలిసి బైక్‌పై వస్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఇంజిన్‌కు ట్రాలీకి మధ్య బైక్‌ ఇరుక్కోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు కారులో ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా లక్ష్మణ్‌ మార్గమధ్యంలో మృతిచెందాడు. సునీల్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

దుబాయిలో కాకులగుట్ట వాసి..

మాచారెడ్డి: బతుకు దెరువు కోసం దుబాయికి వెళ్లిన ఓ యువకుడు ఆదివారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కాకులగుట్ట వాసులు తెలిపారు. తండాకు చెందిన భూక్యా భాస్కర్‌(25) ఏడాదిన్నర క్రి తం దుబాయికి వెళ్లాడు. డ్యూటీలో భాగంగా బస్సులో వెళ్తుండగా ప్రమాద వశాత్తు బస్సు ఓ లోయలో పడిపోయి తలకు గాయాలై భాస్కర్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. భాస్కర్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. భాస్కర్‌ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని తండావాసుల కోరుతున్నారు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి..

దోమకొండ: మండలంలోని లింగపల్లికి చెందిన గుర్రపు వెంకటి(50) ప్రమాదవశాత్తు దోమకొండలోని గుండ్లచెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై గణేశ్‌ సోమవారం తెలిపారు. మృతుడు వెంకటి తన కుమారుడు నరేందర్‌ తో కలిసి బట్టలు ఉతికేందుకు గ్రామ శివారులోని దోమకొండ గుండ్ల చెరువుకు వెళ్లాడు. బట్టలు ఉతుకుతున్న సమయంలో ప్రమాదవశాత్తు వెంకటి కాలుజారి నీటిలో పడిపోయాడు. కుమారుడు నరేందర్‌ అతడిని చెరువులో నుంచి బయటికి తీసి కుటుంబ సభ్యులకు సమాచారం ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. అయితే, వెంకటి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
1/2

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
2/2

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement