నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా.. ఎవరైనా చంపి ఉంటారా..!? | - | Sakshi
Sakshi News home page

నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా.. ఎవరైనా చంపి ఉంటారా..!?

Oct 30 2023 1:04 AM | Updated on Oct 30 2023 12:07 PM

- - Sakshi

నందు(ఫైల్‌)

సాక్షి, నిజామాబాద్‌: మాక్లూర్‌ మండలంలోని గుంజలి గ్రామానికి చెందిన జింక నందు(24) అనే విద్యార్థి చదువుతున్న హాస్టల్‌ గదిలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నట్టు మృతుడి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నందు ఢిల్లీలో హాస్టల్లో ఉంటూ బీటెక్‌ ఆర్కిటెక్చర్‌ విద్యను అభ్యసిస్తున్నాడు.

మొదటగా చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆదివారం తెల్లవారు జామున హాస్టల్‌ నుంచి సమాచారం అందిందని కుటుంబీకులు తెలిపారు. కానీ మెడ భాగం బలంగా కోసి ఉందని, శరీరమంతా రక్తమడుగులో ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా ఎవరైనా చంపి ఉంటారా అనేది తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన నందు శవం ఇంకా స్వగ్రామానికి చేరుకోలేదు. అందరితో కలుపుగోలుగా ఉండే నందు మృతిపై గ్రామంలో విషాదచాయలు ఆలుముకున్నాయి.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement
 
Advertisement
Advertisement