నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వైద్య కళాశాల నిర్మాణ పురోగతిని శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా పనులు పూర్తి కావాలన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. కళాశాల నిర్మాణ పనుల పురోగతిని ఇకపై స్వయంగా ప్రతీ వారం సమీక్షిస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజేందర్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ సింగ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శారద, ఆర్‌అండ్‌బీ ఏఈ అంజనేశ్వర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వివాదాలకు తావులేకుండా భూముల రీ సర్వే
భూముల రీసర్వే నిర్వహణలో ఎటువంటి వివా దాలకు తావు ఉండకుండా చూడాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ అర్బన్ మండలం విశ్వనాథ్ పేట్ సమీపంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్ రాజు, సర్వే అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ బీమా, ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఇందిరమ్మ బీమా పథకం అమలులో ఎలాంటి లోపాలకు తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీమా నమోదు శిబిరాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కుటుంబ సభ్యులు, నామినీ (మైనర్ అయితే అపాయింటీ) వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను గడువులోగా పూర్తి చేయాలన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
సమావేశం అనంతరం ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 ప్రచార పోస్టర్‌ను జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, వెంకట మాధవరావు, డీఆర్‌వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


