ఆలయ భూమి అన్యాక్రాంతం! | - | Sakshi
Sakshi News home page

ఆలయ భూమి అన్యాక్రాంతం!

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

● చదువుల తల్లి స్థలం కబ్జా ● రికార్డుల్లో 4.27 ఎకరాలు.. ● మోఖాపై తగ్గిపోతున్న విస్తీర్ణం

బాసర: రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో బాసర ఒకటి. శక్తిపీఠం అయిన బాసర జ్ఞాన సరస్వతీ దేవాయానికి స్థానికంగా భూములు ఉన్నా యి. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో అ మ్మవారి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. బాసర మండల కేంద్రంలోని రవీంద్రాపూర్‌ శివారులో ఉన్న దేవస్థాన భూమి విస్తీర్ణంపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నంబర్‌ 538లో ఆలయానికి చెందిన 4.27 ఎకరాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నాయి. కానీ మోఖాపై అంతమొత్తం భూమి లేదని స్థానికులు పేర్కొంటున్నారు.

ఆగిపోయిన ప్రహరీ..

గతంలో ఆలయ భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభించి కొంతవరకు కట్టి మధ్యలోనే ఆపివేశారు. మిగిలిన భాగానికి గోడ పూర్తి చేయకపోవడంతో సరిహద్దులపై స్పష్టత లేకుండా పోయింది. ప్రహరీ అసంపూర్తిగా ఉండటం వల్ల ఆ భూమి మొత్తం ఆలయానికే ఉందా అనే అనుమానం కలుగుతోందని గ్రామస్తులు అంటున్నారు. ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని, ఆగిపోయిన ప్రహరీ నిర్మాణం పూర్తి చేసి అమ్మవారి భూమిని పరిరక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

సర్వేచేసి హద్దులు పెడతాం..

బాసర సరస్వతీదేవి ఆలయ భూములు ఆక్రమణ కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. భూముల రీసర్వేలో భాగంగా ఆలయ భూములు రీసర్వే చేయిస్తాం. వీస్తీర్ణంలో తేడా ఉంటే కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం.

– అంజనాదేవి, ఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement