నిర్మల్‌చైన్‌గేట్: విద్యార్థి దశ నుంచే ఓటుహక్కుపై అవగాహన అవసరమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటర్ల అవగాహన (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ఈఎల్‌సీ) పోటీలను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు వజ్రాయుధం లాంటిదని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని సూచించా రు. అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు భారత ఎన్నికల వ్యవస్థ, ఎస్‌ఐఆర్ అంశాలపై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించగా ఖానాపూర్ నియోజకవర్గ బృందం విజేతగా నిలిచింది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. డీఆర్‌వో రాథోడ్ రమేశ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వాతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


