గ్రామాల అభివృద్ధిలో అధికారులు కీలకం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధిలో అధికారులు కీలకం

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

నిర్మల్‌రూరల్‌: గ్రామాల అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్‌ వెంకట మాధవరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్మల్‌రూరల్‌ మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో సుధాకర్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశాభివృద్ధిలో పల్లెలు పట్టుకొమ్మలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అనంతరం పలువురు అధికారులు తమ ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. కౌట్ల (కె), న్యూ ముజ్గి, నీలాయిపేట గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. న్యూముజ్గి గ్రామానికి అదనపు వాటర్‌ ట్యాంక్‌ మంజూరు చేయాలని సర్పంచ్‌ శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. నిర్మల్‌ నుండి కౌట్ల(కే) మీదుగా న్యూముజ్గి వరకు బస్సు నడపాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరారు. వెంగ్వాపేట్‌లో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాన్ని పూర్తి చేయాలని సర్పంచ్‌ సాదా వనిత కోరారు. సమావేశంలో ఆత్మ చైర్మన్‌ రాంరెడ్డి, రూరల్‌ తహసీల్దార్‌ ప్రభాకర్‌, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement