లక్ష్యసాధనకు అంకితభావంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యసాధనకు అంకితభావంతో పనిచేయాలి

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల నిర్దేశిత లక్ష్యాలను వందశాతం సాధించేందుకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేందర్‌ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షక అధికారులతో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో అమలవుతున్న వైద్య సేవల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. లక్ష్య సాధనలో వెనుకబడిన కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అధిగమించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో కార్యక్రమ నిర్వహణ అధికారులు డాక్టర్‌ నైనారెడ్డి, డాక్టర్‌ రాకేష్‌, డాక్టర్‌ పవన్‌, డాక్టర్‌ ఆకాష్‌, డాక్టర్‌ సౌమ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement