ఉత్సాహంగా జోనల్‌ స్థాయి హాకీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా జోనల్‌ స్థాయి హాకీ పోటీలు

Nov 18 2026 12:08 AM | Updated on Nov 18 2026 12:08 AM

ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని ధ్యాన్‌చంద్‌ హాకీ ఫీల్డ్‌లో మంగళవారం ఎస్జీఎఫ్‌ అండర్‌–17 బాలి కల హాకీ జోనల్‌ స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ చాటుకున్నారు. ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌ రెడ్డి, డీటీఎస్‌వో పార్థసారథి పో టీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే హాకీ వంటి క్రీడలో ప్రావీణ్యం సాధించి జోనల్‌ స్థాయి పోటీల కు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. జోన ల్‌ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించాలంటే పట్టుదల, క్రమశిక్షణతో పాటు నిరంతర సాధన ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్‌ కార్యదర్శి ఆడే రామేశ్వర్‌, పీడీలు సాయికుమార్‌, షబ్బీర్‌, రవి, అరుణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement