నషా ముక్త్‌ భారత్‌ కోసం సైకిల్‌ యాత్ర | - | Sakshi
Sakshi News home page

నషా ముక్త్‌ భారత్‌ కోసం సైకిల్‌ యాత్ర

Nov 18 2026 12:08 AM | Updated on Nov 18 2026 12:08 AM

ఆదిలాబాద్‌టౌన్‌/కైలాస్‌నగర్‌: మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరానికి చెందిన 62 ఏళ్ల విజయలక్ష్మి చేపట్టిన 3 వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర మంగళవారం ఆదిలాబాద్‌కు చేరుకుంది. జిల్లాకు చేరిన ఈ యాత్రను కలెక్టర్‌ రాజర్షి షా కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రా ర ంభించారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణా ని కి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్ర జల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చా రు. ఆదిలాబాద్‌కు చేరుకున్న విజయలక్ష్మికి వన్‌టౌన్‌ ఎస్సై అశోక్‌ ఆధ్వర్యంలో ఘన స్వా గతం పలికి సత్కరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.

నిర్మల్‌లో ఘనస్వాగతం

నిర్మల్‌టౌన్‌: రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర మేనేజింగ్‌ కమిటీ సభ్యుడు సామనపల్లి రాఘవులు, పోలీసు అధికారి సమ్మయ్య సైకిల్‌యాత్రకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 50 నుంచి 60 ఏళ్ల వయసులో తాను సాధించిన 8 ప్రపంచ రికార్డుల అనుభవాలను వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement