న్యూస్‌రీల్
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడని విద్యార్థుల హాజరు నవంబర్‌ను హాజరు మాసంగా ప్రకటించిన ప్రభుత్వం నిత్యం 20 శాతానికిపైగా గైర్హాజరు.. ఉపాధ్యాయులదీ.. అదే దారి
నిర్మల్
ఆర్టీసీలో ‘గుర్తింపు’ పరిమితం..!
టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల కార్యకలాపాలపై యాజమాన్యం పరిమితులు విధించింది. తాజా ఉత్తర్వులతో కార్మిక సంఘాల్లో కలవరం మొదలైంది.
సాగునీటి రంగానికి రూ.1.26 కోట్లు
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యాల మెరుగుదల కోసం నాలుగు కీలక పనులకు రూ.1.26 కోట్లు మంజూరయ్యాయని బీజేఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. వడ్యాల్(లక్ష్మణచాంద)లో ఎస్సారెస్పీ ప్రధాన కాలువ(24.30 కి.మీ) వద్ద సూపర్ పాసేజ్ పునర్నిర్మాణానికి రూ.66 లక్షలు, రాచాపూర్‌లో కాలువ (21.90 కి.మీ) వద్ద సూపర్ పాసేజ్ పునర్నిర్మాణానికి రూ.39.40 లక్షలు, ముజ్గి – సాంగ్వి లిఫ్ట్ ఇరిగేషన్ పైపులైన్ లీకేజీల మరమ్మతులకు రూ.17.20 లక్షలు, లింగాపూర్(సారంగాపూర్) చెరువు దిగువన లో–లెవల్ కాజ్‌వే అప్రోచ్ రోడ్డు మరమ్మతులకు రూ.4.25 లక్షలు మంజూరయ్యాయని వివరించారు. ఈ పనుల ద్వారా కాలువల నిర్వహణ మెరుగుపడి సాగునీటి సమస్యలు తీరుతాయని తెలిపారు. నియోజకవర్గంలో రైతాంగ సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
నిర్మల్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయినా క్షేత్రస్థాయిలో అవి పూర్తిగా అమలు కావడం లేదు. నవంబర్ నెలలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం 100 శాతం ఉండాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయినా జిల్లాలో ఈ లక్ష్యం సాధించలేకపోతున్నారు. విద్యార్థుల హాజరు పెంపు కోసం మధ్యాహ్న భోజనం, యూనిఫాంతోపాటు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. హాజరు మాసం నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని వివిధ మండలాల్లోని పాఠశాలలను ‘సాక్షి’ విజిట్ చేయగా, 20 శాతానికిపైగా విద్యార్థుల గైర్హాజరు కనిపించింది.
కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోనూ తగ్గుదల
జిల్లాలో మొత్తం 18 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 6,485 మంది విద్యార్థులకు 88.06 శాతం మంది హాజరయ్యారు. 408 మంది ఉపాధ్యాయులకు 358 మంది హాజరయ్యారు. కుంటాల కేజీబీవీలో 772 మంది విద్యార్థులకు 550 మంది మాత్రమే హాజరయ్యారు.
జిల్లాస్థాయి గణాంకాలు ఇలా..
మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 77 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 48,978 మంది విద్యార్థులకు 37,870 మంది హాజరు కాగా, 11,108 మంది గైర్హాజరయ్యారు. ఉపాధ్యాయుల విషయంలో మొత్తం 3,394 మందికి 2,800 మంది హాజరు కాగా, 594 మంది(17.5 శాతం) గైర్హాజరయ్యారు.
హాజరు పెంచేలా చర్యలు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఈ విషయమై సంబంధిత కాంప్లెక్స్ హెచ్‌ఎం, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. బడులకు విద్యార్థులు గైర్హాజరైతే ఇంటికి వెళ్లి తీసుకురావాలి. అకారణంగా ఉపాధ్యాయులు సెలవులు పెడితే అంగీకరించం. ఎంఈవోలు ఎప్పటికప్పుడు ఆయా పాఠశాలలను తనిఖీ చేయాలి.
– దర్శనం భోజన్న, డీఈవో


