ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

Nov 17 2026 11:56 PM | Updated on Nov 17 2026 11:56 PM

లోకేశ్వరం: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యం వెంట వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టరు వెంకటమాధవరావు అన్నా రు. మండల కేంద్రంలోని ఐకేపీకి వచ్చిన ధాన్యాన్ని మంగళవారం పరిశీలించారు. నగర్‌ గ్రామా శివారు ప్రాంతంలోని ప్రైవేటు గోదాములను తనిఖీ చేశారు. ఏడురకాల వరి ధాన్యం తూకం చేసేముందు ఒక రకానికి చెందిన వడ్లు ఒకే చోట ఉంచాలని, ఒకే లారీలో పంపాలని సూచించారు. తూకం చేసిన వెంటనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమాచేస్తారన్నారు. రైతుల వద్ద సేకరించిన ధాన్యం దగ్గరల్లో ఉన్న గోదాంకు తరలిస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ సూర్యారావు, డీఏం సుధాకర్‌, డీఎస్‌వో రాజేందర్‌, ఏపీఎం భోజన్న, సీసీ మహేందర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement