కడెం/దస్తురాబాద్: కడెం, దస్తురాబాద్ మండలాల్లో డీఆర్డీవో విజయలక్ష్మి, సెంట్రల్ వాటర్ బాడీ టీం సభ్యుడు గణేశ్ మంగళవారం పర్యటించారు. కడెం మండలం నర్సాపూర్ గ్రామంలో వీబీజీ రామ్ జీ పథకంలో భాగంగా నిర్మించిన ఫాంపాండ్‌లను, దస్తురాబాద్ మండలం భూత్కూర్ గ్రామ పంచాయతీలోని రాంపూర్ గ్రామంలో నిర్మించిన గొర్రెల,నాటుకోళ్ల పెంపకం షెడ్లను, ఫాం పాండ్‌లను, చేపల పెంపకాన్ని, ఉపాధి హామీ పనులను పరిశీలించారు. వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా అమలు చేస్తున్న ఫాంపాండ్, ఇంకుడు గుంతలు తదితర జల సంరక్షణ పనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో డీఆర్పీ గంగాప్రసాద్, ఏపీవో జయదేవ్, దస్తురాబాద్ ఎంపీడీవో సయ్యాద్ జావేద్ అలీ, ఎంపీవో రమేశ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనిల్, ఫీల్డ్ ఆసిస్టెంట్ అంజలి, ఏపీఎం శేషు ఉన్నారు.


