బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Nov 17 2026 11:56 PM | Updated on Nov 17 2026 11:56 PM

నర్సాపూర్‌(జి): శివాజీ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మండలంలోని రాంపూర్‌లో ఉన్న శివాజీ హెడ్‌ ఆఫీస్‌ను మంగళవారం కార్మికులతో ముట్టడించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాజన్న మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి ఈనెల 9 నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నా యాజమాన్యం చర్చలకు రాకుండా మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నెలకు 26 రోజులు పని దినాలు కల్పించాలని, నాన్‌ పీఎఫ్‌ కార్మికులకు పీఎఫ్‌ నంబర్లు కేటాయించాలని, వెయ్యి బీడీలకు సరిపడా మంచి తునికాకు ఇవ్వాలని, గంపల నుంచి చాట్‌ చేసిన బీడీలకు కూలీ, ఆకు ఇవ్వాలని కోరారు. ముట్టడిలో బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.బక్కన్న, ఉపాధ్యక్షుడు రామ్‌లక్ష్మణ్‌, జిల్లా జాయింట్‌ సెక్రెటరీ ఎస్‌.గంగన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కె.లక్ష్మి, సరోజన, గౌతమి, కళావతి, పోసవ్వ, శైలజ, స్రవంతి, గంగాధర్‌, శివలింగం, సత్యం, నరేశ్‌, రాజేందర్‌, నర్సయ్య, గంగాధర్‌, గోపి, భూమన్న, గంగన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement