పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి

Nov 17 2026 11:56 PM | Updated on Nov 17 2026 11:56 PM

నిర్మల్‌టౌన్‌: పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించి, నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష మంగళవారం నిర్వహించారు. జిల్లాలో నమోదైన కేసులు, దర్యా ప్తు పురోగతి, నేరాల నియంత్రణ, పోలీస్‌స్టేషన్ల పనితీరును సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న నింది తుల అరెస్టులు పూర్తి చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, హత్యలు, ఆస్తి నేరాలు, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ–సాక్ష్య, ఆన్‌సైట్‌, జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాలు సమర్థవంతంగా అమలు చేయాలని, సీసీటీఎన్‌ఎస్‌, ఐసీజేఎస్‌ వ్యవస్థల్లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, ఇత ర మత్తు పదార్థాలపై నిఘా పెంచడంతోపాటు రా త్రి గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్‌ రైడింగ్‌, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై తనిఖీలు నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు వాహనాలు తనిఖీ చేశారు. వాటి నిర్వహణ, పనితీరును పరిశీలించా రు. వాహనాలను విధులకు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. సమీక్షలో భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐలు, ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement