నిర్మల్ రూరల్: ఇంటర్మీడియట్ బోర్డు రద్దు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సెకండరీ బోర్డులో ఇంటర్ బోర్డు విలీన ప్రతిపాదనతో కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిర్ణయం తీసుకునే ముందు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యావంతులతో సమగ్రంగా చర్చించాలని కోరారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంపై ఏకపక్షంగా వ్యవహరించకుండా సరికాదని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయెబ్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు కై లాష్, ఎస్ఎఫ్ఐ నాయకుడు దిగంబర్, పీడీఎస్యూ నాయకుడు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


