నిర్మల్ క్లబ్ సభ్యుల కొత్త చరిత్ర 1,200 కి.మీ. లక్ష్యాన్ని చేరుకున్న గందె రాహుల్ ‘సూపర్ ర్యాండోనియర్’గా ముక్కా సాయిప్రసాద్
నిర్మల్: నిత్యజీవితంలో వృత్తి విధులు నిర్వహిస్తూనే, ఫిట్నెస్తో కఠినమైన సైక్లింగ్ లక్ష్యాలను చేరుకుంటున్న నిర్మల్ సైక్లింగ్ క్లబ్ సభ్యులు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా గందె రాహుల్, ముక్కా సాయిప్రసాద్(సీఏ) జాతీయస్థాయి పోటీల్లో అరుదైన విజయాలు సాధించారు. ఈ విజయాలపై క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బీఎల్ఎన్.రెడ్డి, ఇతర సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
78 గంటల్లో 1,200 కి.మీలు..
నిర్మల్‌కు చెందిన గందె రాహుల్ అడాక్స్–ఇండి యా నిర్వహించిన 1,200 కి.మీ. సై క్లింగ్ పోటీలో విజ యం సాధించారు. ఈ నెల 12న హైదరా బాద్ నుంచి అనంతపురం, బెంగళూరు, జోగ్ ఫాల్స్ మీదుగా గోవా వ రకు నిర్వహించిన ఈ పోటీలో 90 గంటల లక్ష్యాన్ని కేవలం 78 గంట ల్లోనే పూర్తి చేశా రు. ఈనెల 15న గోవాలో నిర్దేశిత స్థలానికి చేరుకుని అరుదైన ఘనత సాధించారు.


