మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా అపర్ణ | - | Sakshi
Sakshi News home page

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా అపర్ణ

Nov 17 2026 11:56 PM | Updated on Nov 17 2026 11:56 PM

నిర్మల్‌చైన్‌గేట్‌: మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలిగా మేడారం అపర్ణ ప్రదీప్‌ నియమితులయ్య రు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ చేతుల మీదుగా మంగళవారం వరంగల్‌ నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా అప ర్ణ మాట్లాడుతూ, తనకు ఈ బాధ్యతను అప్పగించినందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రా హుల్‌ గాంధీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు, డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నిర్మల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు, ముధోల్‌ మాజీ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, నారాయణరావు పటేల్‌, నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల కావ్య గణేశ్‌చక్రవర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి, సీనియర్‌ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జిల్లాలోని మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement