కార్తిక మాసం కోటి సోమవారం సందర్భంగా జిల్లాలోని శివకేశవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దిలావర్‌పూర్ మండలంలోని అత్యంత ప్రాచీన శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వరాలయం కార్తిక శోభ సంతరించుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగించారు. మహిళలు కుంకుమార్చన చేశారు. ఖానాపూర్‌లోని శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయ అర్చకులు నిమ్మగడ్డ సందీప్‌శర్మ, ఆల య కమిటీ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల పల్లకిసేవ నిర్వహించా రు. భక్తుల శివనామస్మరణతో వీధులు మార్మోగాయి. శివుడికి ప్రీతికరమైన సోమవారం, శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన శ్రవణ నక్షత్రం కలయికతో హరిహరుల అనుగ్రహం లభిస్తుందని సందీప్‌శర్మ తెలిపారు. అనంతరం మహిళలు దీపదానం చేశారు. – ఖానాపూర్/దిలావర్‌పూర్


