ప్రాణ రక్షణ ప్రచారం! | - | Sakshi
Sakshi News home page

ప్రాణ రక్షణ ప్రచారం!

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

భైంసాటౌన్‌: ప్లకార్డు పట్టుకున్న బొమ్మలను చూసి ఇదేదో షాపింగ్‌ మాల్‌ ప్రచారం అనుకునేరు. ఈ విచిత్ర వేషధారణ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు చైతన్యం కోసం. భైంసా పట్టణంలోని ఐక్యత సేవాసమితి ఆధ్వర్యంలో నిర్మల్‌ చౌరస్తాలో ఆదివారం ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి స కాలంలో చికిత్స అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రమాద సమయంలో స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆస్పత్రికి చేరిస్తే ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఐక్యత సేవాసమితి సభ్యులు యోగేశ్‌, శివ, చరణ్‌, సాక్షంత్‌తో పాటు ఇతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement