బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

బాసర: పవిత్ర కార్తిక మాసం, ఆదివారం సెలవు దినం కావడంతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణతో పాటు మహారా ష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తిక మాసం కావడంతో మహిళలు, భక్తులు భక్తిశ్రద్ధలతో గోదావరి నదిలో కార్తిక దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. దీపాల కాంతులతో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. చిన్నారులకు విద్యాబుద్ధులు ప్రసాదించాలని కోరుతూ తల్లిదండ్రులు అక్షర శ్రీకారం పూజలు, ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనాదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

‘ఓపెన్‌’ ప్రవేశాల గడువు పెంపు

నిర్మల్‌ రూరల్‌: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసై టీ ఆధ్వర్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ప్రభుత్వం పెంచినట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఈనెల 30 వరకు నిర్ణీత ఫీజు అపరాధ రుసుముతో గడువు పెంచిందని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు http://www. telanganaopenschool.org వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement