ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 బాల, బాలికల స్విమ్మింగ్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన క్రీడాకారులు తరలివచ్చారు. పోటీలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించి మాట్లాడారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తి చాటాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అనూష, డీవైఎస్వో దయానంద్‌రెడ్డి, డీటీఎస్వో పార్థసారఽథి, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆడె రామేశ్వర్, ఎస్జీఎఫ్ అబ్జర్వర్ సమ్మయ్య, స్విమ్మింగ్‌పూల్ నిర్వాహకుడు రాష్ట్రపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు సాయికుమార్, స్విమ్మింగ్ కోచ్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
పోటీల్లో భాగంగా 400 మీటర్ల ఫ్రీస్టైల్ బాలుర విభాగంలో హైదరాబాద్‌కు చెందిన రివ్యాన్ష్ మొదటి స్థానం సాధించగా, రంగారెడ్డికి చెందిన అర్ణవ్ రెడ్డికి రెండో స్థానం దక్కింది. హైదరాబాద్‌కు చెందిన దేవాన్ష్ రాజ్‌సింగ్ మూడో స్థానంలో నిలిచాడు.


