చిన్నారులకు నంది అవార్డులు | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు నంది అవార్డులు

Nov 16 2026 12:02 AM | Updated on Nov 16 2026 12:02 AM

లక్ష్మణచాంద/నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా కేంద్రానికి చెందిన ఆమెడ మాన్వి, సోన్‌ మండలం కడ్తాల్‌ కు చెందిన సహస్రని నంది అవార్డులు వరించాయ. కడ్తాల్‌కు చెందిన మామిళ్ల లింగయ్య– ఉమాదేవి దంపతుల కుమార్తె సహస్ర కూచి పూడి నృత్యంలో ప్రతిభ కనబరుస్తోంది. నాలు గేళ్ల వయసు నుంచే నృత్యంపై ఆసక్తి పెంచుకున్న చిన్నారి అప్పటి నుంచి సాధన చేస్తూ ప లు సాంస్కృతిక వేదికలపై ప్రదర్శనలు ఇస్తోంది. బాలల దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో నృత్యమాల నాట్యకళ వెల్ఫేర్‌ సొసైటీ , సిరిఆర్ట్స్‌ అకా డమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సహస్ర, నిర్మల్‌ లోని కళానగర్‌కు చెందిన ఆమెడ సుచిత–రాజేశ్‌ దంపతు ల కూరుతు మాన్వి తమ నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. చిన్నా రుల ప్రదర్శనకు నిర్వాహకులు నాట్యమంజరి ప్రశంసాపత్రం, నంది అవార్డు అందజేశారు.

అవార్డులతో చిన్నారులు సహస్ర, మాన్వి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement