నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, వైద్య సేవల అమలుతీరుపై డీఎంహెచ్‌వో రాజేందర్ గురువారం సమీక్ష చేశారు. సంబంధిత ప్రోగ్రామ్ అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాల నిర్దేశిత లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు సాధించాలన్నారు. ఆరోగ్య కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులను గుర్తించి, తగిన పరిష్కార మార్గాలు అన్వేషించాలని సూచించారు. లక్ష్యాల సాధనలో వెనుకబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి, వైద్యాధికారులు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రతీ రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేక వైద్యం అందించాలని, ప్రభుత్వ ఆరోగ్య పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని వివరించారు. సమీక్షలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ నయానరెడ్డి, డాక్టర్ రాజా రమేశ్, డాక్టర్ పవన్‌కుమార్, డాక్టర్ రాకేశ్, డాక్టర్ సౌమ్య, వైద్యాధికారులు పాల్గొన్నారు.


