వెనుక బడిన విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

వెనుక బడిన విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలి

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

● డీఐఈవో జాదవ్‌ పరుశురాం

లోకేశ్వరం: చదువులో వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలని, ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని డీఐఈవో జాదవ్‌ పరుశురాం అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కళశాలను గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులకు సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులు ఉత్తమ ఫలి తాలు సాధించాలన్నారు. కళశాలకు హాజరుకాని వి ద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి కళశాలకు వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యార్థులకు ఉచిత యూనిఫాం, టై, బెల్టు, షూ, సాక్స్‌, నోట్‌బు క్‌ ఇచ్చామన్నారు. త్వరలో మధ్యాహ్న భోజనం అ మలుచేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ఆర్వో ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కళశాల ప్రిన్సిపా ల్‌ విజయలక్ష్మి, అధ్యాపకులు గౌతమ్‌, వెంకటేశ్వర్‌, వినోద్‌కుమార్‌, ప్రమీలారాణి, శ్రీనివాస్‌, నవీన్‌, చిన్నయ్య, మహేందర్‌, సాయినాథ్‌, హరీశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement