అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

లక్ష్మణచాంద: అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అందించడంతోపాటు, లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోన్‌ మండలం సంఘంపేట్‌ గ్రామంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను గురువారం పరిశీలించారు. విద్యు త్‌, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని సదుపాయాలను త్వరగా కల్పించాలని సూచించారు. ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత నిర్మించాలని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అవసరమైన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అలాగే, జాబ్‌ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరూ వీబీజీ రామ్‌ జీ పథకం ద్వారా ఉపాధి పనులు పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సంతోష్‌, ఎంపీడీవో రామకృష్ణ, హౌసింగ్‌ డీఈ గంగాధర్‌, సర్పంచ్‌ మారి విలాస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement