మొక్కజొన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

భైంసారూరల్‌: మొక్కజొన్న రైతులు అప్రమత్తంగా ఉండి.. పంటను ఆశిస్తున్న కత్తెర పురుగు నివారణకు తొలి దశలోనే చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాహుల్‌ విశ్వకర్మ సూచించారు. గురువారం మండలంలోని చింతలబోరిలో మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు లక్షణాలు, నివారణ చర్యలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయాధికారుల సూచన మేరకు క్లోరాంట్రనిలిప్రోల్‌, ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ మందులు పిచికారీ చేయాలన్నారు. ఎకరాకు 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఎదిగిన లార్వాల నియంత్రణకు విషపు ఎర వినియోగం, శనగ పంటలో సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పండిత్‌రావు పటేల్‌, వ్యవసాయ అధికారి గణేశ్‌, ఏఈవో స్వప్న, రైతులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement