కల్లు దుకాణాలపై చర్యలకు వినతి | - | Sakshi
Sakshi News home page

కల్లు దుకాణాలపై చర్యలకు వినతి

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

సారంగపూర్‌: మండలంలోని చించోలి(బి)లో కల్తీ తెల్లకల్లు విక్రయాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకులు గురువారం కలెక్టర్‌ భవేశ్‌మిశ్రాకు ఫిర్యాదు చేశారు. ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామంలో బందెలదొడ్డిని అక్రమంగా కూల్చి వీడీసీ ఆధ్వర్యంలో వ్యాపార సముదాయం నిర్మించారన్నారు. ఎస్సీ కాలనీని ఆనుకుని మూడు కల్తీ తెల్లకల్లు దుకాణాలు ఏర్పాటు చేశారని వివరించారు. దీంతో పిల్లలు సైతం కల్లుకు బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీకల్లు విక్రయాలపై చర్యలు తీసుకొని బందెలదొడ్డి స్థానంలో నిర్మించిన వ్యాపార సముదాయాన్ని పంచాయతీకి కేటాయించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement