నిర్మల్‌టౌన్: ఆటలు ఆడితే ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని నిర్మల్ ఎస్.ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ డీజీఎం గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నిర్మల్ ఎస్.ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీలో పాఠశాలల ఇండోర్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకున్నారు. అకాడమీ డీజీఎంతోపాటు డీన్ రాంబాబు, జోనల్ ఇన్‌చార్జి శిరీష, ప్రిన్సిపాళ్లు సుధాకర్, అర్చన తదితరులు హాజరయ్యారు. క్రీడలతో గెలుపోటములను సమానంగా స్వీకరించే శక్తి అలవడుతుందని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


