నిర్మల్‌రూరల్: సనాతన గోసంస్కతి ఫౌండేషన్ గోసేవా విభాగ్ తెలంగాణ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన గోవిజ్ఞాన పరీక్షలో నిర్మల్‌లోని విజయ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. పాఠశాల నుంచి 300 మంది విద్యార్థులు పరీక్ష రాయగా పది మంది రాష్ట్రస్థాయిలో నిర్వహించే పరీక్షకు ఎంపికయ్యారు. ఈనెల 15న ఆదివారం హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో నిర్వహించే పరీక్షకు హాజరవుతారు. పాఠశాలలో గురువారం విద్యార్థులను చైర్మన్ నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అంబారాణి, జనరల్ సెక్రెటరీ అయ్యన్నగారి భూమయ్య, ఆడెపు సుధాకర్, కరస్పాండెంట్ నాగభూషణం, ప్రిన్సిపాల్ సామ మోహన్‌రెడ్డి అభినందించారు.


