జడ్జిని కలిసిన న్యాయవాదులు | - | Sakshi
Sakshi News home page

జడ్జిని కలిసిన న్యాయవాదులు

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

ఖానాపూర్‌: ఖానాపూర్‌లోని కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన ని ఖి త కు గురువారం ఖానాపూర్‌ బార్‌ అసోసియేష న్‌ సభ్యులు స్వాగతం పలికారు. న్యాయవా దులు జడ్జిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శు భాకాంక్షలు తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మట్టేరి రాజశేఖర్‌, ఏజీపీ ఆసిఫ్‌ అలీ, న్యాయవాదులు వెంకట్‌ మహేంద్ర, బాశెట్టి శివ, ప్రశాంత్‌రెడ్డి, షబ్బీర్‌పాషా, నరేంద్రనాథ్‌, ఖదీర్‌ తదితరులున్నారు.

నేడు మండల సమావేశం

సారంగపూర్‌: మండలకేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం ఉదయం 11గంటలకు సారంగపూర్‌ మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ లక్ష్మీకాంత్‌రావు తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అఽధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.

నియామకం

కడెం: బీజేపీ ఎండోమెంట్‌ సెల్‌ జిల్లా జాయింట్‌ కన్వీనర్‌గా మండలంలో ని అంబారిపేట్‌ గ్రా మానికి చెందిన నరేంద్రు ల ప్రసాద్‌ నియమి తులయ్యారు. తనను నియమించినందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్‌, ఎండోమెంట్‌సెల్‌ జిల్లా కన్వీన ర్‌ కందుల హరీష్‌, మండలాధ్యక్షుడు కాశవేని శ్రీని వాస్‌కు ప్రసాద్‌ కృతజ్ఞతలు తెలి పారు.

సభ విజయవంతం

చేసినందుకు కృతజ్ఞతలు

నిర్మల్‌టౌన్‌: పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో బుధవారం బీఆర్‌ఎస్‌ రైతుగర్జన మహాసభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆ పార్టీ నిర్మల్‌ నియోజకవర్గ ఇనన్‌చార్జి రాంకిషన్‌రెడ్డి తెలిపారు. సభకు రైతులు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి తమ మద్దతు తెలిపారన్నారు. ప్రజల నుంచి లభించిన స్పందన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని ఆయన పేర్కొన్నారు.

మహాసభలకు తరలిరావాలి

ఖానాపూర్‌: నల్లగొండలో ఈనెల 15 నుంచి 18 వరకు నిర్వహించే అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల పోస్టర్లను గురువారం ఖానాపూర్‌లో ఆవిష్కరించారు. రైతు సంఘం మహాసభలకు తరలివచ్చి జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగిల్లి నర్సయ్య, డాకూర్‌ తిరుపతి, దుర్గం నూతన్‌ కుమార్‌, కుక్కరికారుల వెంకటేష్‌, మహమ్మద్‌ రియాసత్‌, నలిమెల రాజేష్‌ పాల్గొన్నారు.

పనులు కల్పించాలి

భైంసారూరల్‌: అడిగిన వారికి వీబీజీ రామ్‌జీ పథకం కింద ఉపాధి పనులు కల్పించాలని అదనపు డీఆర్డీవో విఠల్‌.. సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండలంలోని టాక్లీ గ్రామంలో ఉపాధి పనులు పరిశీలించారు. ఈసందర్భంగా కూలీలతో మాట్లాడుతూ.. వారి సమస్యలు, సౌకర్యాలు, పనుల వివరాలు తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం పనులు చేయించాలని సిబ్బందికి సూచించారు. సర్పంచ్‌ శివాజీ పటేల్‌, పంచాయతీ కార్యదర్శి భోజారం, టీఏ ప్రతిభ, సంజీవ్‌ పటేల్‌, గంగాధర్‌, దేవరావు ఉన్నారు.

పనులు వేగవంతం చేయండి

లక్ష్మణచాంద: సోన్‌ మండలంలోని న్యూబొప్పారం గ్రామంలో వీవో భవన నిర్మాణ పనులను అదనపు డీఆర్డీవో నాగవర్ధన్‌ పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. న్యూబొప్పారం స ర్పంచ్‌ దేశెట్టి నరేశ్‌, న్యూవెల్మల్‌ సర్పంచ్‌ సాగర్‌, ఏపీవో రామకృష్ణ ఉన్నారు.

ఏళ్ల కల నెరవేరడంపై హర్షం

నర్సాపూర్‌(జి): నిర్మల్‌ డిపో నుంచి మండలంలోని నందన్‌ గ్రామం మీదుగా కుంటాల మండలం ఓలా గ్రామం వరకు ఆర్టీసీ బస్సును ప్రారంభించడంతో సుమారు పదేళ్ల కల నెరవేరిందని నందన్‌ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం నందన్‌లో గ్రామ సర్పంచ్‌ కూన హేమలత మహేశ్‌ బస్సును ప్రారంభించారు. ఈ బస్సు నందన్‌, బామ్ని (బి), అంబకంటి, కుంటాల, ఓలా గ్రామాల మీదుగా నడుస్తుందని.. ప్రజలు సద్వి ని యో గం చేసుకోవాలని సర్పంచ్‌ కోరారు. డ్రైవర్‌, కండక్టర్లను గ్రామస్తులు సన్మానించారు. ఉపసర్పంచ్‌ సతీశ్‌, రవికుమార్‌, నరేశ్‌, సాయన్న, భూమన్న తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement