సారంగపూర్: ఎల్‌నినో నేపథ్యంలో యాసంగిలో రైతులు వరి పంట కాకుండా.. ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. సారగంపూర్ మండలంలోని ఆలూరులో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ పంటలను దళారులకు విక్రయించి మోసపోకుండా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కరువు ప్రభావిత జిల్లాగా ప్రకటించాలి..
నిర్మల్ జిల్లాను కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు తమ పంట నిల్వ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 89 గోదాములను మంజూరు చేసిందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు కాల్వ నరేశ్, సర్పంచులు ఈర్ల చిన్నయ్య, పోతన్న, సాహెబ్‌రావు, నాయకులు రాంశంకర్‌రెడ్డి, విజయ్, రవికుమార్ తదితరులు ఉన్నారు.
83 మందికి చెక్కులు పంపిణీ
సారంగపూర్: మండలకేంద్రంలోని రైతువేదికలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 83 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. చెక్కుల మంజూరు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ఎమ్మెల్యే సూచించారు. తహసీల్దార్ విజయ్‌కాంత్‌రావు, ఎంపీడీఓ లక్ష్మీకాంత్‌రావు, సర్పంచులు, కార్యదర్శులు ఉన్నారు.
లక్ష్మణచాంద, సోన్ మండలాల్లో..
లక్ష్మణచాంద: మండలకేంద్రంలోని రైతువేదికలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి.. 45 మంది లబ్ధిదారులకు, సోన్ రైతువేదికలో 19 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. తహసీల్దార్లు సరిత, సంతోష్‌కుమార్, ఎంపీడీవోలు వనజ, రామకృష్ణ, డీటీ బాబుసింగ్, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్‌లో 66 మందికి చెక్కులు..
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్‌లో 66 మందికి రూ.66 లక్షల 7వేల 656 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. వీరిలో నిర్మల్ పట్టణానికి చెందినవారు 50 మంది.. నిర్మల్‌రూరల్ మండలానికి చెందినవారు 16 మంది ఉన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


