సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

● వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలి ● ఉపాధ్యాయులు శ్రద్ధతో బోధించాలి ● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయులు అంకితభావంతో బోధన సాగించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. విద్యార్థులందరూ ప్రతిరోజూ పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని తిరిగి పాఠశాలలకు వచ్చేలా చూడాలన్నారు. నిర్ణీత సమయంలో సిలబస్‌ పూర్తి చేయడంతోపాటు, విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు పరీక్షలు నిర్వహించాలని, చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని సూచించారు. ఉపాధ్యాయులందరూ విధులకు క్రమం తప్పకుండా హాజరు కావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం, సురక్షిత తాగునీరు అందించడంతోపాటు, పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఈవో భోజన్న, సంక్షేమ శాఖల అధికారులు దయానంద్‌, నిహారిక, శ్రీనివాస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

భూముల రీసర్వే పారదర్శకంగా చేపట్టాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పారదర్శకతతో పూర్తి చేయాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా.. అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 85 గ్రామాల్లో చేపట్టిన భూ సర్వే పురోగతిని మండలాల వారీగా తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో రైతుల సమక్షంలోనే పకడ్బదీంగా చేపట్టి హద్దులను నిర్ణయించాలన్నారు. సర్వే వివరాలు రైతులకు తెలిపి తప్పులకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించకుండా.. ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వెంకట మాధవరావు, ఏడీ ల్యాండ్స్‌ అండ్‌ సర్వే రికార్డ్స్‌ విఠల్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement