మత్స్యకారులు రాజీ కుదుర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులు రాజీ కుదుర్చుకోవాలి

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

దస్తురాబాద్‌: వివాదాల జోలికి వెళ్లకుండా సమన్వయం పాటిస్తూ సమస్య పరిష్కరించుకోవాలని అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) వెంకట మాధవరావు.. మత్స్యకారులకు సూచించారు. మండలంలోని భూత్కూర్‌ పంచాయతీ పరిధి రాంపూర్‌, దస్తురాబాద్‌ గ్రామాల మత్స్యకారుల నడుమ సమీప గోదావరిలోని చింతమడుగులో చేపల వేట విషయమై వివాదం నెలకొంది. కలెక్టర్‌ ఆదేశాలతో గురువారం దస్తురాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌, ఇతర అధికారులు..రాంపూర్‌, దస్తురాబాద్‌ గ్రామాల మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు సర్ది చెప్పినా ఇరు గ్రామాల మత్స్యకారుల మధ్య రాజీ కుదరలేదు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. పంచాయతీ నిధులతో గోదావరి తీర ప్రాంతంలో 10 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సర్పంచులను ఆదేశించారు. పదేళ్లుగా జీవనోపాధి కోల్పోతున్నారని.. గ్రామపెద్దలు, అధి కారుల సూచనలు పాటించి రాజీ కుదుర్చుకోవాలని ఇరు గ్రామాల మత్స్యకారులకు సూచించారు. రాజీ కుదుర్చుకుంటేనే చింతమడుగులో నిషేధ ఆజ్ఞలు ఎత్తివేత్తామని పేర్కొన్నారు. తహసీల్దార్‌ యాదవరావ్‌, జిల్లా మత్సకారశాఖ ఏడీ అన్వేష్‌, సర్పంచులు గోపాల్‌, సింగరి విజయ, నాయకులు కిషన్‌, ఇరు గ్రామాల మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement